ప్రతి క్షణం
ప్రజల పక్షం

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు
భవిష్యత్ తరాలకు నీటి వనరుల సంరక్షణలో భాగంగా కీలక చర్య

రుద్రాంపూర్, మే 8, ఆధాబ్ న్యూస్:
భూగర్భ జలాల పరిరక్షణ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ.) ఆధ్వర్యంలో మరో కీలక అడుగు వేయబడింది. అన్ని బ్యాంకు శాఖల వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు చేయాలని ఎస్.బి.ఐ. రీజినల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.

రుద్రాంపూర్ ఎస్.బి.ఐ. బ్రాంచ్ వద్ద నిర్వహించిన ఇంకుడు గుంత తవ్వే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇంకుడు గుంతలు భూగర్భ జలాల భద్రతకు అత్యంత అవసరం. ఇవి భవితవ్య తరాలకు నీటి వనరులను పరిరక్షించే శ్రీరామ రక్షగా నిలుస్తాయి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఈశ్వర్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, హెచ్.ఆర్. మేనేజర్ రాములు, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్