ములుగు జిల్లాలో మందుపాతర పేలుడు: ముగ్గురు పోలీసుల మృతి, పలువురికి గాయాలు
ములుగు,మే8 ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వాజేడులో గురువారం ఉదయం జరిగిన మందుపాతర పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మావోయిస్టుల బీభత్సంలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు హతమవగా, అదే నేపథ్యంలో వెంకటాపురం పరిసర అడవుల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ముందుగా మందుపాతర పేల్చి, అనంతరం కాల్పులకు తెగబడ్డారు.
పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండగా, ఘటనా స్థలానికి అధిక పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.









