ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ ఆధాబ్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. నగర భద్రత, నియంత్రణ చర్యలపై అమలు జరుగుతున్న విధానాలను ఆయన సమీక్షించారు.

సెంటర్‌లో ఉన్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించిన సీఎం, నగరంలో నిరంతర నిఘా కొనసాగించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన, పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా, హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పూర్తిగా అనుసంధానం చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రతి కూడలిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సాంకేతిక సదుపాయాలను నిపుణులు సమర్థవంతంగా వినియోగించి భద్రతా చర్యలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సమర్థంగా పనిచేయాలంటే అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!