ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కొత్తగూడెంలో ఏసీబీ దాడులు: సింగరేణి డ్రైవర్ రాజేశ్వరరావు అరెస్టు

కొత్తగూడెంలో ఏసీబీ దాడులు: సింగరేణి డ్రైవర్ రాజేశ్వరరావు అరెస్టు

కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: సింగరేణి మెయిన్ వర్క్ షాప్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న బోయిన రాజేశ్వరరావు ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో, మెడికల్‌గా అన్‌ఫిట్ చేయించి, బదిలీలు చేయిస్తానంటూ రూ. 50 లక్షలు వరకు డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

రాజేశ్వరరావు తోపాటు ఒక బృందంగా ఏర్పడి మరోవైపు వివిధ అక్రమాలకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ కేసులో మరికొంతమంది పేర్లు కూడా త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్‌ను ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలో చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్