వాసవి నగర్లో త్రాగునీటి సమస్యకు పరిష్కారం – ఎమ్మెల్యే పాయం .
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలోని వాసవి నగర్లో త్రాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది. గత కొంతకాలంగా శుద్ధమైన త్రాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు, ఈ సమస్యను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశంపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి, వాసవి నగర్లో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందన చూపించిన ఎమ్మెల్యేను వాసవి నగర్ నివాసితులు మణుగూరు ప్రజా భవన్లో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
వాసవి నగర్ అభివృద్ధికి చేసిన ఈ సూచిక చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 147









