ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వట్టం నారాయణ దొరకు టీడీపీ కీలక బాధ్యత – భద్రాచలం పరిశీలకులుగా నియామకం

వట్టం నారాయణ దొరకు టీడీపీ కీలక బాధ్యత – భద్రాచలం పరిశీలకులుగా నియామకం

భద్రాచలం ఆధాబ్ న్యూస్: తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గ్రామ/వార్డు మరియు మండల/పట్టణ/డివిజన్ స్థాయిలో కమిటీల ఏర్పాటు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా పినపాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వట్టం నారాయణ దొరను పార్టీ నియమించింది.

పార్టీకి ఎంతోకాలంగా విశ్వసనీయంగా సేవలందిస్తున్న నారాయణ దొరకు ఈ కీలక బాధ్యత అప్పగించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఆయన నాయకత్వంలో భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నియామకంతో పినపాక నుంచి టీడీపీ నాయకులకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పటిష్టత కోసం ఆయన తీసుకునే చర్యలు ఫలితాలు ఇవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్