ఉత్తమ సేవల కోసం బయ్యారం సీఐ వెంకటేశ్వరరావుకు అవార్డు – జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సత్కారం
భద్రాద్రి కొత్తగూడెం , ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) వెంకటేశ్వరరావు ఉత్తమ సేవలకుగాను జిల్లాలో ప్రశంసనీయం పురస్కారాన్ని అందుకున్నారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా గురువారం ఈ అవార్డును అందుకున్న వెంకటేశ్వరరావు, ఏజెన్సీ ఏరియాలో ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అందించిన సేవలకు గుర్తింపుగా క్యాష్ రివార్డు కూడా లభించిందని, ఇది తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
“నా సేవలను గుర్తించి పురస్కారాన్ని అందించడం ఎంతో గర్వకారణం. ఇది నా బాధ్యతను మరింత పెంచుతుంది,” అని సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బయ్యారం సీఐకి జిల్లా పోలీస్ అధికారులు, మండల ప్రజలు, వివిధ సంఘాలు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.









