మణుగూరు ,ఆదాబ్ న్యూస్:
గుండాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సైదా రవుఫ్, మణుగూరు మండలంలోని ప్రజా భవన్‌లో పినపాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల గుచ్చాన్ని అందజేసి, తన కొత్త బాధ్యతలపై ఆశీర్వాదం పొందారు. ఎమ్మెల్యే పాయం
వెంకటేశ్వర్లు ఎస్‌ఐ సైదా రవుఫ్‌ను అభినందించి, ప్రజల సేవలో నిజాయితీగా, నిష్పక్షపాతంగా పని చేయాలని ఆకాంక్షించారు. నూతన ఎస్‌ఐగా రవుఫ్ బాధ్యతల స్వీకరణతో గుండాల ప్రాంత ప్రజల్లో భద్రతపై మరింత నమ్మకం ఏర్పడింది.
Post Views: 30









