ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రాధిక స్కూల్‌కు మండల ఫస్ట్ ర్యాంక్ పదో తరగతి ఫలితాల్లో ప్రతిభాపూరిత విజయం.

రాధిక స్కూల్‌కు మండల ఫస్ట్ ర్యాంక్ పదో తరగతి ఫలితాల్లో ప్రతిభాపూరిత విజయం.
పినపాక,ఆధాబ్ న్యూస్ :
పినపాక మండలంలోని పేరుపొందిన రాధిక స్కూల్ పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి మండల ఫస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాల స్థాపితమైనప్పటి నుంచి ప్రతి ఏడాది 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని తెలిపారు. ఈ ఏడాది వి.హశ్వంత్ సాయి, 576 మార్కులతో మండల ఫస్ట్ ర్యాంక్ సాధించగా, కె.యశ్వంత్ రెడ్డి, 573 మార్కులతో మండల సెకండ్ ర్యాంక్‌ను అందుకున్నారు. మూడో ర్యాంక్ జి.ప్రవళిక ,571 సాధించారు.
ఇది మాత్రమే కాకుండా 500కు పైగా మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య 28కి చేరగా, మొత్తం 52 మంది విద్యార్థులూ పూర్తి ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో రాధిక స్కూల్ విద్యా ప్రగతికి మార్గదర్శకంగా నిలుస్తోందని, విద్యార్థుల భవిష్యత్తును అభివృద్ధి చేసే దిశగా మరింత కృషి చేస్తామని తెలిపారు.

ఈ విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చింతకుంట జయసింహ రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రిన్సిపాల్ సాజీమన్, ఇన్‌చార్జి టీచర్లు రామకృష్ణ, హిమబిందు, కళాశాల ప్రిన్సిపాల్ నిరోషా రెడ్డి, రవి ప్రసాద్ రెడ్డి పాల్గొని అభినందనలు తెలిపారు.

ఈ విజయం రాధిక స్కూల్ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!