లంకమల్లారం లో ప్రధానం వేడుకలో ఎమ్మెల్యే పాయం.
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లంకమల్లారం గ్రామానికి చెందిన పాయం వెంకటయ్య, భద్రమ్మ దంపతుల కుమార్తె సౌందర్య , వెడ్స్ బాలరాజు ప్రధానం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, నూతన వధువుకు అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆమెకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Post Views: 27









