మృతి చెందిన మంగమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలోని దమ్మక్కపేట గ్రామానికి చెందిన మాజీ ABN ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బిల్లా సీతారాములు తల్లి బిల్లా మంగమ్మ అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ రోజు వారి నివాసానికి వెళ్లి మంగమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 37









