ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మంత్రి తుమ్మల పర్యటనలో అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

మంత్రి తుమ్మల పర్యటనలో అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వరావుపేట,ఆధాబ్ న్యూస్
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పర్యటన సందర్భంగా అధికారుల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనుల వివరాలు, మంత్రి పర్యటన షెడ్యూల్ తనకు ముందుగా తెలియచేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇది తన మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన, ప్రజాప్రతినిధులను సమ్మానించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.

ఈ ఘటన అశ్వారావుపేట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వేయడం, మంత్రి పర్యటనలో చోటుచేసుకున్న ఉద్వేగ పరిస్థితులు మరింత రాజకీయ వేడిని పెంచేలా ఉన్నాయి.

ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ శ్రేణుల్లో ఏవిధమైన స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!