రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు!
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల విడుదలకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవగా, ఫలితాలను ఏప్రిల్ 30 లేదా మే 1వ తేదీన ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధికారులు తుది ఏర్పాట్లు జరుపుతున్నారు.
గత మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈసారి మార్కుల మెమోలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు మొత్తం మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (GPA) ఇవ్వగా, ఈసారి ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి విడిగా మార్కులు, గ్రేడ్లు చూపనున్నారు. విద్యార్థుల స్పష్టత కోసమే ఈ మార్పులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
Post Views: 29









