డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ వైస్ చైర్‌పర్సన్‌గా శాంతి కుమారి ఐఏఎస్ నియామకం
ఆధాబ్ న్యూస్ ,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐఏఎస్‌ను డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆమె ఈ నెల 30న పదవీవిరమణ చేసిన వెంటనే ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL-A) విభాగం 2025 ఏప్రిల్ 28న G.O. Rt. No.523 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నియామకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు త్వరలో వేరుగా విడుదల కానున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వులను కార్యదర్శి ఎం. రఘునందన్ రావు జారీ చేశారు. శాంతి కుమారి ప్రస్తుతం ఉన్నత పరిపాలన అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆమెకు సీఏస్‌గా సేవలందించిన అనుభవం ఈ కొత్త బాధ్యతలో ఉపయోగపడనుంది.
Post Views: 96









