ఆధాబ్ న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (G.O.Rt.No.513) జారీ చేసింది. ప్రస్తుతం ఫైనాన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణ రావు, పదవీ విరమణకు సిద్ధమైన ఎ. శాంతి కుమారి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
ఐఏఎస్ 1989 బ్యాచ్‌కు చెందిన ఎ. శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన వయోపరిమితి కారణంగా పదవి నుంచి విరమించనున్నారు. ఆమె పదవీ విరమణ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించింది.
ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పాలిటికల్) ఎం. రఘునందన్ రావు విడుదల చేశారు. తాజా నియామకంతో రాష్ట్ర పరిపాలనలో మరింత చక్కదిద్దే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Post Views: 62









