ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థులు, 2000-21 పదవతరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాటి బ్యాచ్‌ల విద్యార్థులు భారీగా హాజరై తమ జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకున్నారు.

సమ్మేళనంలో తమకు చదువు చెప్పిన గురువులకు ఘనంగా సన్మానాలు నిర్వహించారు. గురువులకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తమ విజయం వెనుక ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని తెలిపారు.

ఇటీవలి 25 సంవత్సరాలలో పూర్వ విద్యార్థుల అభివృద్ధిని చూపిస్తూ, విద్యారంగం, ఇతర రంగాల్లో వారు సాధించిన విజయాలను గుర్తించి శభాషి పలికారు. పూర్వ విద్యార్థులు భవిష్యత్తులో భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీహరి, నేతాజీ, శంకర్రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్