మణుగూరు, ఆధాబ్ న్యూస్:
ఏలూరు జిల్లా గురువాయిగూడెం గ్రామానికి చెందిన కమ్మ వెంకటరత్నారావు-విమలమ్మ దంపతుల ప్రధమ కుమార్తె మక్కిన రమేష్ సతీమణి యోజీ (యామిని) జ్ఞాపకార్థంగా, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మణుగూరు మండలం సంతోష్‌నగర్‌లోని శ్రీ విద్యాభ్యాస (పూర్వ బాలవెలుగు) పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాఠశాల అభివృద్ధి నిమిత్తం యాభై కిలోల బియ్యాన్ని, నిత్యావసర వస్తువులను వితరణగా అందించారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, యోజీ జ్ఞాపకార్థంగా ప్రతి ఏడాది ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. అదేవిధంగా అక్షర యోజి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు విద్యా సహాయాన్ని అందిస్తున్న వారిని ప్రశంసించారు.
పాఠశాల తరఫున కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సభ్యురాలు జమీలా బేగం, సామాజిక సేవా కార్యకర్త అంగోత్ మంగీలాల్, పాఠశాల నిర్వాహకులు బి. జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్, ఉపాధ్యాయిని సుహాసిని దేవి, సిబ్బంది సుజాత, రాధా తదితరులు పాల్గొన్నారు.









