ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింల ప్రార్థనలు. -పహల్గాం ఉగ్రదాడికి కలిగిన హింసను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన

నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింల ప్రార్థనలు.
-పహల్గాం ఉగ్రదాడికి కలిగిన హింసను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:  పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం మండలంలోని కరకగూడెం,పద్మాపురం,అనంతారం మసీదుల్లో ముస్లింలు వారి చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.అనంతరం ఉగ్రదాడికి కలిగిన హింసను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి రెండు నిమిషాల మౌనం పాటించారు.ఉగ్ర దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.అలాగే ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమైన విషయమని,మృతుల కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.కాగా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు మేరకు ముస్లింలు నల్ల రిబ్బలను ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలు మసీదుల కమిటీ సభ్యులు సయ్యద్ సజ్జాద్ హుస్సేన్,షేక్ సోందుపాషా,మొహమ్మద్ రఫీ,సయ్యద్ ఫజల్ హుస్సేన్,యాకుబ్ ఖాన్,మహిమూద్,ఖయ్యుమ్,మౌలానాలు ఫిరోజ్,ఆజాం,జఫరుద్దీన్, అన్సార్,అఫ్రోజ్,అల్తాఫ్,ఉమర్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!