పినపాక ఎమ్మెల్యే పాయంను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కరకగూడెం ఎస్సై పీవీ నాగేశ్వరరావు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నూతన ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కరకగూడెం ఎస్ఐగా పీవీ నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామస్వామి వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు బహుకరించారు.
నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ పీవీ నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలందించాలన్న ఆశయంతో నూతన ఎస్ఐ తన విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో స్థానిక పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 46









