ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇల్లు నిర్మాణ పనులను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బేస్ మీట్ దశను పూర్తిచేసిన వెంటనే లక్ష రూపాయల నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించిన ఎమ్మెల్యే, యజమానులు దగ్గరుండి పనులను పరిశీలించి, నాణ్యతతో నిర్మించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీ వాణి, తిరుపతయ్య, యర్ర సురేష్, రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్