ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిపై మంత్రి సీతక్క ఖండించారు.

జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిపై మంత్రి సీతక్క ఖండించారు.
ఆధాబ్ న్యూస్, హైదరాబాద్:
జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని మంత్రి సీతక్క ఖండించారు. ఈ దాడిని ఆమె “దుర్మార్గపు చర్య”గా అభివర్ణించారు. “ఎలాంటి సిద్ధాంతం లేని ముష్కర మూక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని చంపడం అమానవీయం,” అని ఆమె పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలను బలిగొనాలని ఏ మతమూ ఉపదేశించదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఉగ్రదాడిలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్