పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి
పినపాక ,ఆధాబ్ న్యూస్, ఏప్రిల్ 23: మండలంలో వేసవికాలం కారణంగా ఎండలు ఎక్కువగా ఉన్నందున పినపాక మండల ప్రజలకు పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి పలు సూచనలు చేశారు జాగ్రత్తలు పాటిద్దాం ఎండ తీవ్రత నుండి సురక్షితంగా ఉందామని ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో గొడుగు తప్పనిసరిగా వాడాలి దూదితో నేయబడిన తెలుపు లేదా లేత రంగు పలచటి వస్త్రాలను ధరించాలి బహిరంగ ప్రదేశాలలో వెలితే టోపీ లేదా రుమాలు పెట్టుకోవాలి అని ఉప్పు కలిగిన మజ్జిగ ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం తీసుకోవాలి వడదెబ్బలకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించి చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో శరీరం అంత తుడిచిన తర్యా సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితుల్లో ఆశించిన మార్పు లేనిచో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు తెలిపారు.









