చింతలపాడు గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ .రాజ్ కుమార్
పినపాక,ఆధాబ్ న్యూస్: పినపాక మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి పేరు తెచ్చుకోనీ అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించాలని అన్నారు అసాంఘిక శక్తులకు సహకరించకూడదని గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. చిన్నారులకు స్వీట్స్, బిస్కెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 43









