అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు . కరకగూడెం,ఆధాబ్ న్యూస్
కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ నుంచి రాయనపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మలకం రమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనకు కారణమైన ట్రాక్టర్ను స్థానిక యువకులు పక్కకు జరిపి, వెంటనే 108 వాహనానికి సమాచారం అందించి బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Post Views: 112









