ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు అదుపులోకి – కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు అదుపులోకి – కేసు నమోదు చేసిన పోలీసులు
పినపాక, ఆధాబ్ న్యూస్: విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం, ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సూచనలతో ఎస్ఐ రాజ్ కుమార్ సిబ్బంది దిలీప్, శ్రీనివాస్, లక్ష్మయ్య, గంగరాజు లతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
ఈ సమయంలో ప్యాసింజర్ ఆటోలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 1) సునారి ఆదిత్య (21), నేతకాని, విద్యార్థి, తోగ్గూడెం గ్రామానికి చెందినవాడు, 2) సత్యేంద్ర లోకేష్ (19), బీసీ, తోగ్గూడెం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.
వారు కుంట గ్రామం నుండి దాదాపు ఒక కేజీ 300 గ్రాముల గంజాయిని తాగడానికి మరియు చుట్టుపక్కల యువకులకు అమ్మే ఉద్దేశంతో తీసుకువస్తుండగా పట్టుబడ్డారు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!