ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడితే ఎంతటి వారైన చర్యలు తప్పవు – ఏడూళ్ళ బయ్యారం సీఐ

అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడితే ఎంతటి వారైన చర్యలు తప్పవు – ఏడూళ్ళ బయ్యారం సీఐ
పినపాక,ఆధాబ్ న్యూస్ : రాత్రి సమయంలో అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపులు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పట్టుబడితే ట్రాక్టర్లు, డ్రైవర్లు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదే సందర్భంగా కొన్ని ట్రాక్టర్ యజమానులు మైనర్లకు మద్యం తాపించి ఇసుక తోలకాలకు ఉపయోగిస్తున్నారని సమాచారం అందిందన్నారు. అటువంటి ఘటనలను ఏ మాత్రం వదిలే ప్రసక్తి లేదని, చట్టపరంగా కఠినంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

రాత్రి సమయంలో ఎవరైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!