కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలో ఎస్సై. రాజేందర్ సేవలు వెలకట్టలేనివి ఒక నిజమైన ప్రజాసేవకుడిగా శాంతి భద్రతల పరిరక్షణలో తన ప్రాముఖ్యతను పోషించాడు సామాన్య ప్రజల రక్షణ కోసం ఆయన చేసిన కృషి అంతులేనిది. సమయానికి స్పందించి, ప్రజల సమస్యలను నిగూఢంగా అర్థం చేసుకుని పరిష్కారం చూపడం ఆయన ప్రత్యేకత.
సేవల పట్ల నిబద్ధత
ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించగల ధైర్యం, సమర్ధత లోతైన అస్త్రాలు. గస్తీ విధులు, నేరాల నివారణ, బాధితులకు న్యాయం అందించడంలో ఆయన అసాధారణ నైపుణ్యం చూపారు శ్రమకు విలువనిచ్చే ఈ అధికారి, తన ప్రాతినిధ్యంలోని పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు.
ప్రజల్లో అవగాహన – ఎవర్నెస్ కార్యక్రమాలు
ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన కల్పించడంలో రాజేందర్ ఎస్సై ముందు వరుసలో ఉంటారు. పాఠశాలలు, గ్రామ సభలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతలో చట్టపరమైన విజ్ఞానాన్ని పెంపొందించారు. మహిళల రక్షణ, ట్రాఫిక్ నియమాలు, డ్రగ్స్ వ్యతిరేకత – ఇలా పలు అంశాలపై అవగాహన కల్పించారు
ఫ్రెండ్లీ పోలీసింగ్ – మానవతా దృక్పథం
పోలీసులంటే భయం కాదు, నమ్మకం అనే భావనను ప్రజల్లో కల్గించేందుకు రాజేందర్ ఎస్సై ఎంతో శ్రమించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తూ, గ్రామస్థులతో నిత్యం పరస్పర సంబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారు. పిల్లలతో ముచ్చటించడం, వృద్ధులకి సహాయపడటం వంటి చిన్నచిన్న చర్యల ద్వారా ఆయన హృదయాలను గెలుచుకున్నారు.
ఈ విధంగా రాజేందర్ ఎస్సై కరకగూడెం మండలంలో ఒక ఆదర్శ పోలీసు అధికారిగా, ప్రజలలో నమ్మకాన్ని, భద్రతను, అవగాహనను పెంపొందించే విషయంలో కీలక పాత్ర పోషించి ఇక్కడి నుండి బదిలై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి వెళ్తున్నారు.









