ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పినపాక మండలంలో ఘనంగా నిర్వహణ

భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పినపాక మండలంలో ఘనంగా నిర్వహణ
పినపాక,ఆధాబ్ న్యూస్ : భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పినపాక మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల అధ్యక్షుడు ధూళిపుడి శివప్రసాద్ ఆధ్వర్యంలో దుగినేపల్లి, జానంపేట, వెంకట్రావుపేట, రావిగూడెం, చింతలబయ్యారం, గోపాలరావుపేట, తొగ్గూడెం గ్రామాల్లో వేడుకలు వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ, “బీజేపీ పార్టీ 45 ఏళ్లపాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మూడవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ రోజు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ విజయపతాకం ఎగురవేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీగా మారింది. ఇటువంటి గొప్ప పార్టీలో సభ్యులమై పని చేయడం గర్వకారణం. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొనగంటి రామకృష్ణ, మండల నాయకులు పొనగంటి సతీష్, గంప చంద్రకుమారి, యాగమాటి గంగాధర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలతో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్