ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అసంపూర్తి బస్సు షెల్టర్ పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామం వీరాపురం క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న బస్సు షెల్టర్‌ను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించిన ఆయన, త్వరలోనే బస్సు షెల్టర్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు వర్షాలు, ఎండలు తట్టుకొని ఇబ్బందులు పడకుండా త్వరితగతిన షెల్టర్‌ను పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు. ఈ పనులు వేగంగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!