ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కౌలూరు అటవీ ప్రాంతంలో గుడుంబా స్థావరాలపై మెరుపు దాడి

కౌలూరు అటవీ ప్రాంతంలో గుడుంబా స్థావరాలపై మెరుపు దాడి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల పరిధిలోని కౌలూరు అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం కరకగూడెం ఎస్సై రాజేందర్ తన సిబ్బందితో కలిసి గుడుంబా స్థావరాలపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 3,000 లీటర్ల గుడుంబా పానకాన్ని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గుడుంబా తయారీ జరుగుతోందని అందిన సమాచారం మేరకు ఈ దాడిని నిర్వహించారు. ఎస్సై రాజేందర్ మాట్లాడుతూ, మండలంలో ఎవరైనా గుడుంబా తయారీ లేదా విక్రయానికి పాల్పడుతున్నట్లు తెలిసిన సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
అక్రమ మద్యం ఉత్పత్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా సహకరించి ఈ తరహా అక్రమ కార్యకలాపాలను నివారించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!