ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రూప్-1 ఫలితాల్లో మెరిసిన ఇల్లందు ఎస్సై సందీప్‌ను సన్మానించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ

గ్రూప్-1 ఫలితాల్లో మెరిసిన ఇల్లందు ఎస్సై సందీప్‌ను సన్మానించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో 502.5 మార్కులతో ప్రతిభ చాటిన ఇల్లందు ఎస్సై సందీప్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఘనంగా సన్మానించారు.
ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సందీప్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ గ్రూప్-1 పరీక్షలకు హాజరైన సందీప్, తన కఠిన పట్టుదలతో విజయాన్ని సాధించడం గర్వకారణంగా పేర్కొన్నారు.
సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి కృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన సందీప్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!