ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో మద్యం దందా..

కరకగూడెంలో మద్యం దందా..

ఎక్సైజ్ రూల్స్ బ్రేక్.
సొంత రూల్స్ అమలు చేస్తున్న మద్యం” వైన్ షాపు” వ్యాపారులు..
కుప్పలుతెప్పలుగా బెల్ట్ షాపులు. లైట్ తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారులు.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం మండలంలో మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. సిండికేట్గా ఏర్పడిన మద్యం షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ నిబంధనలను పక్కనబెట్టి సొంత రూల్స్ అమలు చేస్తున్నారు. బ్రాండెడ్ మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ మద్యం ప్రియులకు మొండి చేయి చుపిస్తున్నారు. మండలంలో బ్రాండెడ్ మద్యం కావాలంటే బెల్టు షాపులకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే వైన్ షాపుల్లో బ్రాండుల మద్యం దొరకదు ఒకవేళ దొరికిన ఎక్కువ సేపు విక్రయించారు. మద్యం సిండికేట్ గాళ్ళు బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ వారికే అన్ని రకాల బ్రాండుల మద్యాన్ని అమ్ము కుంటూ మద్యం ప్రియుల జేబులను గుల్ల చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ వైన్ షాప్లో దొరికే మధ్యమే తాగుదామంటే కనీసం ఎమ్మార్పీ ధరకు కూడా అమ్మకుండా అధిక రేట్లను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. బెల్ట్ షాపుల్లో ఒక క్వార్టర్కు సుమారు 50 నుంచి 70 రూపాయల అధిక ధర వసూలు చేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే గొడవలకు దిగుతున్నారని పలువురు మద్యం ప్రియులు వాపోతున్నారు.

వైన్ షాపుల యాజమాన్యాలు అవ్వడం వల్లనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మద్యం ప్రియులు తాము కష్టపడి సంపాదించిందంతా బెల్ట్ షాపులకి ధారబోయాల్సి వస్తుందంటున్నారు.

ఈ కారణంగా వారి కుటుంబాలలో గొడవలు సైతం చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం బెల్టు షాపులు ఎత్తివేయాలని యోచిస్తుండగా కరకగూడెం మండలంలో మాత్రం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. ఈ దోపిడీని నియంత్రించవలసిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుండి ఫిర్యాదులు వెళ్లినా ఆ ఫిర్యాదులను బుట్ట దాఖలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో బట్టుపల్లి బడి,కరకగూడెం గుడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలుస్తున్నా ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బట్టుపల్లి పగలు, రాత్రి తేడా లేకుండా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు జరుపుతుండడంతో మందుబాబులు కిక్కు ఎక్కువ అయ్యి గొడవలకు దిగుతున్నారని ఈ వ్యవహారం తమకు ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి కరకగూడెం మండలంలోని సిండికేట్ దందాను అరికట్టవలసిందిగా స్థానికులు ఈ సందర్భంగా కోరుతున్నారు.

ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన వెంకటనారాయణ

ఎక్సైజ్‌శాఖ చర్యలు శూన్యం..

విచ్చల విడిగా బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్న అబ్కారీశాఖ అధికారులు పట్టించుకో వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లిప్తతతో మద్యం కల్తీ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెల్టు షాపుల్లో మద్యం కల్తీ విపరీతంగా జరుగుతున్నట్లు ఆరోపణలు న్నాయి. కల్తీ మద్యం కారణంగా ప్రజలు ఆనారోగ్యాల భారిన పడే ప్రమాదం ఉంది. అయినా సరే అధికారులు పట్టించుకున్న పాపాన పోవ డం లేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!