పినపాక ,ఆధాబ్ న్యూస్ :
పినపాక మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల ఓ రైతుకు చెందిన సుమారు 50 క్వింటాల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా కేసును చేధించడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ పోలీసుల కృషిని అభినందించారు. “శభాష్ పోలీస్” అంటూ స్థానిక ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది లక్ష్మీనారాయణ, దిలీప్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









