ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏజెన్సీ ప్రాంతంలో నేతకాని కులపెద్దల అత్యవసర సమావేశం.

ఏజెన్సీ ప్రాంతంలో నేతకాని కులపెద్దల అత్యవసర సమావేశం.

గుండాల, ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న నేతకాని కుల పెద్దలు తమ సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని గుండాల మండలం చింతలపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల నేతకాని కుల పెద్దలు హాజరై తమ హక్కుల గురించి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.మేము వలసవాదులం కాదు మా హక్కులు సమర్ధించాలి
ఈ సందర్భంగా నేతకాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జి జాడి శ్రీనివాస్ మాట్లాడుతూ గత పూర్వకాలం నుంచే మేము ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే జన్మించి, ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. మేము వలసవాదులం కాదు. ఆదివాసీ సోదరులతో మమేకమై, వారితో సమానంగా జీవిస్తున్నాం. అయితే, ప్రభుత్వాలు ఏజెన్సీలో కొన్ని చట్టాలు రూపొందించాయి. కానీ, ఆ చట్టాల్లో మా నేతకాని సమాజానికి ఎటువంటి హక్కులు కల్పించలేదు. గత ప్రభుత్వాలు మాపై వివక్ష చూపించాయి. కనుక, ప్రస్తుత ప్రభుత్వం అయినా మా సమస్యలను గుర్తించి, న్యాయం చేయాలి” అని వారు పేర్కొన్నారు.ప్రధాన డిమాండ్లు:
భూమి హక్కులు: ఏజెన్సీ ప్రాంతంలో నేతకాని సమాజం సాగుచేస్తున్న భూములకు హక్కులు కల్పించాలి.
ఉద్యోగాలు & విద్యా అవకాశాలు: చదువు పూర్తి చేసిన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
ఏజెన్సీ చట్టాల్లో మార్పులు: ఏజెన్సీలో అమలవుతున్న చట్టాల్లో నేతకాని సమాజానికీ అన్ని హక్కులు కల్పించాలని కోరారు.
న్యాయం జరగకపోతే ఉద్యమాలకు సిద్ధం.
ఇప్పటికైనా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. లేనిపక్షంలో మా సమాజాన్ని మేల్కొలిపి, ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం” అని నేతకాని కుల పెద్దలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
జాడి శ్రీనివాసరావు (నేత)
గాందెర్ల నిత్యానందం
దుర్గం సమ్మయ్య (మాజీ ఎంపీటీసీ)
జనగాం వీరస్వామి
పెంటయ్య
తదితర కుల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!