ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పరమేశ్వరుడిని దర్శించుకున్న ఎస్సై రాజ్ కుమార్.

పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని సీతంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం ఇ .బయ్యారం ఎస్సై ఇమ్మిడి రాజ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు,స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించినట్లు రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు బండారు నరేంద్ర ఆధ్వర్యంలో కమిటీ వారు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్