కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో సీతారాంపురం గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అక్రమంగా పిడిఎస్ బియ్యం రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కరకగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్, పద్మాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ నోమన్ కలిసి 20 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అశోక్ లైలాండ్ బండితో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.
తక్షణమే బియ్యాన్ని వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం, నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఇస్తున్న పిడిఎస్ బియ్యం ఎవరైనా కొని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Post Views: 57









