కరకగూడెం పంచాయతీలో మిషన్ భగీరథ నీటి సమస్య..
కరకగూడెం, ఆధాబ్ న్యూస్, కరకగూడెం మండలం మండలంలోని మేజర్ పంచాయతీ, ప్రజలు గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో అవరోధాలను ఎదుర్కొంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ఇళ్ల నుంచి కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య వల్ల విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానికులు ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను కోరుతున్నారు. నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 38









