ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక నూతన ఎంపీడీవో సునీల్ కుమార్‌ను కలిసిన

సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్.
పినపాక , ఆధాబ్ న్యూస్:
పినపాక మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్‌ను సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిట్టా వెంకటేశ్వర్లు ఎంపీడీవో సునీల్ కుమార్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తానని, ఎవరైనా ఏ సమస్య ఉన్నా తమను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిపాలనా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు కొంపెల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షుడు యాకన్నా, ప్రధాన కార్యదర్శి గుడికందుల రాజశేఖర్, ట్రెజరర్ గుమాస్ వెంకటేశ్వర్లు, సభ్యులు కొంపెల్లి నాగేష్, దొడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!