నందీశ్వర రైస్ మిల్లులో ధాన్యం నిల్వలపై సివిల్ సప్లై అధికారి తనిఖీ.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండల కేంద్రంలోని నందీశ్వర రైస్ మిల్లులో డిప్యూటీ తహసిల్దార్ (సివిల్ సప్లై) గుంటి. శివకుమార్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం 3,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నందీశ్వర రైస్ మిల్లుకు కేటాయించిందని తెలిపారు.
ప్రస్తుతం 870 మెట్రిక్ టన్నుల రైస్‌ను సివిల్ సప్లైకి అప్పగించినట్లు పేర్కొన్నారు. మిగిలిన 2,130 మెట్రిక్ టన్నుల రైస్‌ను కూడా సివిల్ సప్లైకి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మిల్లులో నిల్వలు, సరఫరా ప్రక్రియపై సమీక్ష చేపట్టిన ఆయన, నిబంధనలకు అనుగుణంగా ధాన్యం రవాణా చేయాలని సూచించారు.
Post Views: 57









