ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జర్నలిస్ట్ కప్ 2024-25 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

పినపాక ఆధాబ్ న్యూస్ : పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కప్ 2024-25 క్రికెట్ టోర్నమెంట్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఎమ్మెల్యే క్రికెట్ ఆడి, రెండు టీములకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.టోర్నమెంట్ నిర్వహించిన ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భద్రాచలం మండలానికి చెందిన గొంగడి త్రిష మహిళా అండర్-19 T20 వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గోపాలపురం గ్రౌండ్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్‌తో చర్చించి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్