పినపాక,ఆధాబ్ న్యూస్: పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ మరియు రోడ్డు భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీస్ సిబ్బంది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్ ధరించడం, గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు తిరిగి పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రాధాన్యతను వివరించారు. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు పాస్‌వర్డ్ భద్రత, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని సూచించారు. ఈ
కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రోడ్డు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 146









