ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నియామకం

వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నియామకం.

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్‌లోని వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ (డబ్ల్యూ సి ఆర్) జాతీయ కార్యాలయంలో డబ్ల్యూ సి ఆర్ వ్యవస్థాపకులు, జాతీయ చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీకి నియామక పత్రాలను అందించారు.
ఈ నియామకాలలో జిల్లా చైర్మన్‌గా సారిక లింగయ్య, డిప్యూటీ చైర్మన్‌లుగా చెట్టిపల్లి దామోదర్ మరియు మీట్టపల్లి గోపి ని నియమించారు. వారందరికీ నియామక పత్రాలను అందిస్తూ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, వినియోగదారుల హక్కులను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, వినియోగదారుల అవసరాలు, న్యాయం, నాణ్యత ప్రమాణాల రక్షణ కోసం డబ్ల్యూ సి ఆర్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.
అదే విధంగా, ఎక్కడైనా వినియోగదారులు మోసపోతే, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకోవడం డబ్ల్యూ సి ఆర్ బాధ్యతగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూ సి ఆర్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చింతకింద మహేంద్ర గౌడ్, తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ సత్యదేవ్, జిహెచ్ఎంసి వైస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్