ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నూతన సంవత్సర వేడుకల్లో గ్రామీణ వైద్యులు.

ఆధాబ్ న్యూస్, కరకగూడెం:గ్రామీణ వైద్యుల మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామీణ వైద్యులు,పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రఫీ ప్రసంగిస్తూ, కొత్త సంవత్సరాన్ని సంతోషకరంగా, ఆరోగ్యంతో ప్రారంభించాలని తోటి గ్రామీణ వైద్యులకు సూచించారు. గ్రామీణ వైద్యుల సేవలను మెచ్చుకుని, ప్రజల ఆరోగ్యానికి మరింతగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, సమాజంలో ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందించేందుకు గ్రామీణ వైద్యుల పాత్ర కీలకమని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. కొత్త సంవత్సరం అందరికి ఆరోగ్యం, ఆనందం, శాంతి చేకూర్చాలి అన్నారు .ఈ కార్యక్రమంలో తోటి గ్రామీణ వైద్యులు సొందు పాషా , అబ్దుల్లా, రామలింగేశ్వరరావు, సారీక లింగయ్య , విజయ్, సారంగపాణి , కామేష్ , హరీష్ , లాలు , నరం దాస్ వెంకటేశ్వర్లు, శ్రీను , సల్లూరు వెంకటేశ్వర్లు, రమేష్, రవి, రమేష్ , శ్రీను , రామ్మూర్తి , కోటి, సునీలు సత్యనారాయణ, నాగేష్, సత్యనారాయణ, మురళి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!