యాజమాన్యం పై కఠినంగా చర్యలు తీసుకోవాలని జిమ్మిడి ప్రకాష్,దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్.
ఆధాబ్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాది కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను,వారి తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మరియు అన్ని మండలాల్లోని పాఠశాలల యజమానుల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నేతకని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫీజలు కట్టమని విద్యార్థులను బయట నిల్చోపెట్టడం జరుగుతుంది అన్నారు.అదేవిధంగా ఫీజలు కట్టని విద్యార్థుల ను అసభ్య కరంగా మాట్లాడడం జరుగుతుంది అని ,కావున ఇట్టి విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని యెడల అన్ని పాఠశాలల ముందు తమ సంగం అధ్వార్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుర్గం సురేందర్, యూత్ ప్రెసిడెంట్ గోగు సాయి దినేష్ ప్రవీణ్ ప్రసాద్ అర్జున్ వినయ్ సంగీత్ వంశీ సాంబశివరావు పార్ధు తదితరులు పాల్గొన్నారు.









