ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రామ పంచాయతీ కార్మికుడు పిచ్చయ్య కుటుంబానికి న్యాయం చేయాలి.

ఆధాబ్ న్యూస్ ,కరకగూడెం: కరకగూడెం పంచాయతీలో మల్టీ పర్పస్ కార్మికుడిగా పనిచేస్తున్న ఇల్లందుల పిచ్చయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తగిన విధంగా న్యాయం చేయాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు మంగళవారం అధికారులను కోరారు .పంచాయతీ కార్మికులు ప్రజల ఆరోగ్యాల కోసం పరిశుభ్రత పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారని వారి సేవలను గుర్తించి. పిచ్చయ్య కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తూ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఎంపీడీవో కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు సంజీవరావు, ఉప్పల్ సాంబశివరావు, గుమ్మడవెల్లి కృష్ణ, కంగాల సురేష్, శంకర్, వీరస్వామి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్