ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తాటిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నీ

తాటిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నీ

ఆధాబ్ న్యూస్, కరకగూడెం: నూతన సంవత్సరం,సంక్రాంతి పండగ పురస్కరించుకొని తాటిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఆదివాసి యువసేన అసోసియేషన్ సభ్యులు తెలిపారు .జనవరి 12,13,14 తేదీలలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలు తాటిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్నామని ఈ క్రీడల కరపత్రాన్ని మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి రవీందర్ రెడ్డి ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి లు ఆవిష్కరించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలను విజయవంతం చేయాలని, క్రీడలతోపాటు చదువులలో ఉన్నత స్థానాల్లో రాణించాలని ఏజెన్సీ ప్రాంతంలో క్రీడల పట్ల మక్కువ ఎక్కువగా ఉందని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తర్ఫీదు పొంది మన ప్రాంతం యొక్క పేరు ప్రఖ్యాతలు గడించేలా క్రీడాకారులు రాణించాలని ఈ క్రీడలను విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొగ్గలి కృష్ణయ్య, పోలేబోయిన రామారావు,కొమరం కాంతారావు,పోలెబోయిన సత్యనారాయణ, పోలేబోయిన సుధాకర్, చంద శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్