ఆధాబ్ న్యూస్, పినపాక :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి నాగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం ను అందించాలని అన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, స్టోర్ రూం పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Post Views: 67









