ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రైవేట్ పాఠశాల డ్రైవర్లకు క్లీనర్లకు చట్టబద్ధత హక్కులు అమలు చేస్తాం.

 

కార్మిక శాఖ అధికారి నాగరాజు.
ఆధాబ్ న్యూస్ ,మణుగూరు:
మణుగూరు మండలంలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు, క్లీనర్లకు ఛట్టబద్ధమైన హక్కులను అమలు చేస్తామని మణుగూరు కార్మిక శాఖ అధికారి నాగరాజు అన్నారు.మణుగూరు కు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు కర్నే బాబురావు ఫిర్యాదు మేరకు ఆయన హామీ ఇచ్చారు. లేబర్ ఇనస్పెక్టర్ ఎన్. నాగరాజు బుధవారం శివలింగాపురంలోని కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి తో కార్మిక శాఖ అధికారి నాగరాజు చొరవతో సామరస్య వాతావరణంలో చర్చలు జరిగాయి . వివరాలు ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లకు మరియు క్లీనర్లకు సంవత్సరానికి రెండు జతల కాకి యూనిఫామ్, వారాంతపు సెలవు, నెలకు రెండు లీవులు, కార్మిక శాఖ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ జీవో అమలు చేస్తాం,పిఎఫ్ అమలు, 15 రోజుల గడువు లోపల అమలు చేస్తామని హామీ ఇచ్చారని బాబురావు విలేకరులకు తెలిపారు .ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారి నాగరాజు కి కృతజ్ఞతలు తెలిపారు. తమ చట్టబద్ధ హక్కుల కోసం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై ఒత్తిడి చేసి తమకు న్యాయం చేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావును ప్రైవేట్ స్కూల్స్ డ్రైవర్లు, క్లీనర్లు ధన్యవాదాలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్