. కరకగూడెం ఎస్ఐ.రాజేందర్. ఆధాబ్,న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని మోతే శివారు ప్రాంతంలో కరకగూడెం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో మహోస్టులు వారోత్సవాలు నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ పెట్టుకోని వాహనం నడపాలని అన్నారు. మావోయిస్టులకు ఎవరు కూడా సహకరించ వద్దని ఎవరైన అనుమానాస్పదంగా కనపడితే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపకూడదు మీ మీద నమ్మకం పెట్టుకున్నా మీ కుటుంబం ఆధారపడి ఉంది. మీరు మద్యం సేవించి వాహనం నడిపి ప్రాణాలు ప్రమాదంలో కోల్పోయి మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడే పడేయవద్దు వాహనదారులకు ఆయన సందర్భంగా తెలియజేశారు.









