ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మంచినీటి శుభ్రత వాడకంపై అవగాహన సదస్సు.

ఆధాబ్ న్యూస్,పినపాక: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో మంచినీటి శుభ్రత, వాడకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బోరు బావులు, బావులు పంపుల వద్ద శుభ్రం చేయించి, మంచినీటిలో క్లోరినేషన్ చేయించడం జరిగిందని ఏఈ విజయ్ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల పరిధిలో ఎటువంటి మంచినీటి సమస్య ఉన్న వెంటనే తెలియజేయాలని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రవీణ్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్